calender_icon.png 27 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

26-09-2025 10:30:18 PM

చాకలి ఐలమ్మ జయంతిలో నేతలు

కాటారం,(విజయక్రాంతి): చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని మండల రజక సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీశాలి అని, సమానత్వం కోసం పోరాటం చేసి అసువులు బాసిన చాకలి ఐలమ్మ జీవితం త్యాగానికి ప్రతీకగా పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు ప్రతినిధిగా ,  ఆత్మాభిమానానికి ఆదర్శ నీయురాలుగా పేర్కొంటూ చాకలి ఐలమ్మ సేవలను కొనియాడారు.