calender_icon.png 27 September, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ల సేవలు అభినందనీయం...

26-09-2025 10:25:30 PM

బోధన్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ల సేవలు అభినందనీయమని, నిరంతర విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, లయన్స్ క్లబ్ శ్రీ హరి సేవా ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కుక్కర్లు, చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన కృషి చేస్తుందన్నారు. ఈ సందర్బంగా అంగన్వాడీ సూపర్ వైజర్లకు 110 కుక్కర్లు అందజేశారు.

ఐఐటీ లో సీటు సాధించిన విద్యార్ధికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, లయన్స్ క్లబ్ ఆఫ్ జూబిలీ హిల్స్ ల ఆధ్వర్యంలో లాప్ టాప్ అందజేశారు. ముందుగా లయన్స్ కంటి ఆసుపత్రికి 28లక్షల రూపాయలతో సమకూర్చిన నూతన వాహనాన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అంతకు ముందుగా డివిజన్ లోని సాలూర మండలంలోని జాడీ గ్రామంలో 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. చక్కెర కర్మాగారం ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ చెరకు సాగుకు రైతులు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే అన్నారు. రైతులు అయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసారని అన్నారు. ఉపాధ్యాయులను నియమించడం, వివిధ ప్రభుత్వ శాఖలలో అధికారులను, సిబ్బందిని, నియమిస్తుంటే బిఆర్ఎస్ పార్టీ నానా గొడవలు సృష్టిస్తున్నాయని అన్నారు. కోర్టులకేక్కి నియామకాలు జరుగకుండా అడ్డుతగులు తున్నారని అన్నారు.విద్యుత్ సమస్యలు పరిష్కరించాడానికి కృషి చేస్తున్నామని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో సుమారు 50కోట్ల రూపాయలతో మూడు సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.