calender_icon.png 11 November, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన

11-11-2025 10:12:42 PM

చిట్యాల (విజయక్రాంతి): మహిళల, బాలల రక్షణ చట్టాలపై విద్యార్థులకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మేనేజర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో బేటి బచావో, బేటి పడావో కార్యక్రమాన్ని గ్రీన్ గ్రో స్కూల్, న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అంశంపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శిశు విక్రయాలు, బాల్యవివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయని అన్నారు.

ఇటువంటి సంఘటనల  వల్ల ఆడపిల్లలపై వివక్షత ఏర్పడుతుందని,  ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి వాటిని ఆపాలంటే విద్యార్థులకు విద్యార్థి దశలోనే అవగాహన ఎంతో అవసరమని అన్నారు.ఆడపిల్లల అమ్మడం, శిశువిక్రయాలపై, బాల్యవివాహాలపై ప్రతి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, విద్యార్థులకు తెలియజేశారు. ఏ ప్రాంతంలోనైనా శిశు విక్రయాలు కానీ అక్రమంగా దత్తత తీసుకున్న వారికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఆడపిల్లకు ఆపద వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ను 1098  సంప్రదించాలని తెలిపారు. 

మహిళ, బాలల రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.  విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు గాను గ్రీన్ గ్రో స్కూలు యాజమాన్యం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ లావణ్యకు శాలువాతో   సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ  వెంకటమ్మ, గ్రీన్ గ్రో స్కూల్ డైరెక్టర్  వేణుగోపాల్ రెడ్డి, న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్  ప్రకాష్,  స్కూల్ టీచర్స్, విద్యార్థులు, అంగన్వాడి టీచర్ దాడి అరుణ,అపర్ణ,బుజ్జమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.