calender_icon.png 11 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరామిరెడ్డి తనిఖీలు

11-11-2025 10:14:49 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అంతేకాకుండా పోలీసులు అత్యవసర పరిస్థితులలో వినియోగించే వస్తువులను వాటి నాణ్యతను పరీక్షించారు. గ్రామ పోలీసు అధికారులు, ఆయా గ్రామాల ప్రజలకు నేరాలపైన ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించాలని, నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్కెట్ పల్లి సీఐ కే నాగరాజు ఎస్సై ఎమ్ రవికుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.