11-11-2025 10:08:52 PM
కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మరో పండరిపురంగా పిలుచుకునే శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహ పూజార్ల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా ప్రారంభమైంది. ఆలయ పూజలు ప్రమోద్ మహారాజ్ రాజమహారాజులుద్, రాజు మహారాజ్ లు ఆలయ ప్రాంగణంలోని గణపతి, ముట్టముట్టలేశ్వరాలయంలో విఠల-రుక్మిణి విగ్రహాలకు ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. ఆ లైన్లో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో నిర్ణయించిన ముహూర్తంలో తలసత్వం వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజీ, ఉపాధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి బచ్చు ప్రసాద్, గ్రామస్తులు పుప్పాల పీరాజి, కందుర్ రాజన్న, భజన కారులు, తదితరులు పాల్గొన్నారు.