06-11-2025 07:37:08 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ... ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు లావాదేవీలు గాని ఇతర పర్సనల్ వివరాలు గాని అడిగితే చెప్పకూడదన్నారు. మనకు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి ఏదైనా ఓటిపి వచ్చింది చెప్పమన్న ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదన్నారు.
మనకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉంటే నేరుగా బ్యాంక్ కు వెళ్లి వాటిని సరి చూసుకోవాలని అన్నారు. బ్యాంకు వాళ్లు ఎవరు కూడా ఫోన్లో మన అకౌంట్ సమాచారాలు అడగరని నిత్యం జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు తోపాటు అధ్యాపకులు విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు.