24-01-2026 01:15:38 AM
స్టాన్లీ కాలేజీలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): అబిడ్స్‌లోని చాపల్ రోడ్డు స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో ఎన్‌ఎస్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ‘అగ్ని ప్రమాదాలు -వాటి నివారణ‘ అంశంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించా రు. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ బి ప్రదీప్ కుమార్, పి బసంత్, వారి టీమ్ వచ్చింది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. పరిశ్రమలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, షాపింగ్ మాల్లు మొదలగు ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని గుర్తు చేశారు.
ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను ఎలా ఉపయోగించాలో డెమో నిర్వహించి చూపించారు. గ్యాస్ సిలిండర్ నుంచిగ్యాస్ లీకై మంటలు వచ్చేటప్పుడు ఎలా ఆర్పాలో చూపించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కె కృష్ణారావు, మేనే జ్మెంట్ సభ్యులు టి రాకేష్ రెడ్డి, డీన్ ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి ఎల్ రాజు, డా. జి పద్మశ్రీ, డా. ఆర్ గంగాధర్, ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.