calender_icon.png 28 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల కామర్స్‌ఫోరం ఆధ్వర్యంలో సీఏ కోర్సుపై అవగాహన

28-11-2025 01:09:23 AM

జగిత్యాల అర్బన్, నవంబర్ 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా లోని కామర్స్ అధ్యాపకులు ఏర్పాటు చేసిన జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు సీఏ కోర్సు పై అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా కామర్స్ విద్య, ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదవడం ద్వారా కలిగే ప్రయోజనాల పై న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదవడానికి పట్టే సమయం, ఖర్చు, తరగతుల నిర్వహణ, చదవాల్సిన విధానం, పరీక్షల వివరాలు, జీవితంలో ఎంత ఉన్నతంగా స్థిరపడవచ్చు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ వైస్ చైర్మన్ వి. శేఖర్ రెడ్డి, సెక్రటరీ బెక్కంటి అజయ్, సి ఏ విద్యార్థి విభాగం అధ్యక్షులు గందెశ్రీ శ్రీనివాస్, మాజీ సెక్రటరీ వెన్నం శ్యాంసుందర్, మల్లేశం, ఎం. శివకుమార్, జగిత్యాల కామర్స్ ఫోరం కన్వీనర్, నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్, కామర్స్ ఫోరం సభ్యులు, జగిత్యాల జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.