calender_icon.png 28 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి విడత గ్రామ పంచాయతీ

28-11-2025 01:08:57 AM

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఖమ్మం, నవంబర్ 27 (విజయ క్రాంతి): ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం నుండి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మొదలైంది. రఘునాథపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చింతగుర్తి, గణేశ్వరం, రఘునాథ పాలెం గ్రామాల నామినేషన్లు స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

దాఖలు చేసే నామినేషన్ ప్రతాలను పరిశీలించారు.   ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ అనుదీప్ దురిశెట్టి మా ట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణ కేం ద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ఏలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవ గాహన కలిగి ఉండాలని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై పూర్తి భాద్యతతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని 7 మండలాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 192 సర్పంచ్, 1740 వార్డు సభ్యల స్ధానాలకు గురువారం నుండి ఈనెల 29 శనివారం వరకు ఉద యం గం.10-30 నిమిషాల నుండి సాయంత్రం 5.00 గంటలకు వరకు కేటాయించిన కేంద్రాలలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు.

మొదటి విడుతలో 3వేల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతు ఎన్నికల సిబ్బందికి అందించాలని, ప్రతి గ్రామంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన మేర అధికారులు, సిబ్బంది, పోలీసు సుమారు 8వేల మంది నియామకం పూర్తి చేశామని అన్నారు. కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.