calender_icon.png 28 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన వ్యయ పరిశీలకురాలు లావణ్య

28-11-2025 01:10:39 AM

అశ్వాపురం, నవంబర్ 27, (విజయక్రాంతి):మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలు పాటిస్తూ కొనసాగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య అశ్వాపురం మండలంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. రాంచంద్రపురం, మొండికుంట, నెల్లిపాక, మల్లిమడుగు, అశ్వాపురం, తురవారిగూడెం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వ్యయ పరిశీలకురాలు అభ్యర్థులు సమర్పిస్తున్న నామినేషన్ పత్రాలు, జతపరచిన అఫిడవిట్లు, ఖర్చుల వివరాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిస్థితులను పరిశీలించారు. వ్యయ పరిశీలకులు లావణ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు.

అభ్యర్థులు వ్యయం వివరాలు సమర్పించినట్లు అయితే గెలుపు రద్దు అవుతుందనే విషయాన్ని కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆమె తెలిపారు.గ్రామపంచాయతీలో పోటీ చేసే అభ్యర్థలకు వ్యయాలకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాత ఉండాలని ఆమె సూచించారు.సర్పంచ్,వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు పెట్టాలనే విషయము అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.