calender_icon.png 5 January, 2026 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ పొదుపుపై అవగాహన

03-01-2026 04:17:49 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని ఇందాని గ్రామంలో విద్యుత్ పొదుపు, విద్యుత్ ప్రమాదాల నివారణపై శనివారం విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే ఇందాని గ్రామ సర్పంచ్‌తో కలిసి విద్యుత్ వినియోగదారులకు, గ్రామస్తులకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ జాడే మాట్లాడుతూ… విద్యుత్ వినియోగంలో మితవ్యయం పాటించడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, అక్రమ కనెక్షన్లను నివారించాలని, నిర్లక్ష్య వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో (ఎస్‌ఏఓ) దేవిదాస్ లావడ్య, (ఏడీఈ) శ్రీనివాస్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, లైన్ ఇన్‌స్పెక్టర్ రవి, సురేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.