calender_icon.png 1 August, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి నుండి వ్యవసాయం బాట పట్టిన విద్యార్థులు

31-07-2025 09:48:09 PM

వరి నాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి

పొలంలో వరి నాట్లు వేస్తూ సందడి చేసిన చిన్నారులు

చిన్నశంకరంపేట/చేగుంట,(విజయక్రాంతి): చిన్న శంకరంపేట మండలం పరిదిలోని చందాపూర్ లో ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రైతే రాజు, అనే విషయంపై  గ్రామంలోని వ్యవసాయం పొలం దగ్గరికి విద్యార్థులను తీసుకువెళ్లి, విద్యార్థులకు వ్యవసాయ, పొలంలో విద్యార్థులచే వరి నాట్లు వేయించి వరి నాట్లపై అవగాహణను  కల్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు వరి పండే విధానాన్ని వివరించారు. విద్యార్థులు వ్యవసాయ పొలంలో వరి నాటు వేస్తూ, ఆనందంతో గంతులు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెతుకు పరమేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు తోటవ్వ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.