calender_icon.png 1 August, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇరువురు సిబ్బంది పదవీ విరమణ

31-07-2025 09:51:24 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పదవి విరమణ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో సహాయక ఇంజనీర్ సివిల్ గా పని చేస్తున్న ఆర్. లక్ష్మణ్ రావు  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుండి బదిలీపై వేములవాడలో పని చేస్తున్న జి.లక్ష్మణ్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ రాధా బాయి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చిరు సత్కారం అందజేశారు. అనంతరం ఆలయ యూనియన్ ఆధ్వర్యం లో శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్ర పటం మరియు ప్రసాదము అందజేశారు.