28-07-2025 09:01:51 PM
జగదేవపూర్: కేజీబీవీ స్కూల్(KGBV School) జగదేవపూర్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం. ఈ సందర్భంగా జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాలపై అవగాహన పెంచుకొవాలి అని అన్నారు.
అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు అని సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది అన్నారు.చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ స్రవంతి,అధ్యాపకులు ఏఎస్ఐ రమణారెడ్డి, గజ్వెల్ షీటీమ్ బృందం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.