calender_icon.png 29 July, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులే తాళాలను పగలగొట్టి ఇంట్లోకి వెళ్తారు

28-07-2025 09:34:00 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్..

జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలను అధికారులు ఇవ్వడం లేదని వారం రోజుల్లో తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే తాళాలను పగలగొట్టి తమ ఇళ్లలోకి వెళతారని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్(CPM District Secretary Jayarajan) అన్నారు సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారుతో కలిసి ఆయన జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ 20 23 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు 660 ఇండ్లను లబ్ధిదారులకు వారం రోజుల్లో ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

లబ్ధిదారులు బీద బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు సెప్టెంబర్ 20 23 సంవత్సరంలో లబ్ధిదారులకు పట్టాలి ఇచ్చి ఇంతవరకు లబ్ధిదారులకు అధికారులు తాళాల ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన వివరించారు ఇప్పటికే వందలాది మంది లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా రేపు మా పంటూ కాలయాపన చేస్తున్నది తప్ప ఇళ్ల తాళాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.

వారం రోజుల్లో అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే స్వయంగా వెళ్లి తాళాలను పగలగొట్టి డబుల్ బెడ్ ఇళ్లను స్వాధీనం చేసుకుంటారని ఆయన తెలిపారు లబ్ధి దారులు ఇళ్లలోకి వెళ్లిన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు ప్రజా పాలన ఇందిరా మా రాజ్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప బీద ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ఆయన వివరించారు అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకే తాము వారం రోజుల పాటు వేచి చూస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్ మైపాల్ లబ్ధిదారులు తిరుపతి శ్రీనివాస్ శివకుమార్ స్వప్న లావణ్య తదితరులు పాల్గొన్నారు.