calender_icon.png 5 January, 2026 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

04-01-2026 03:37:40 PM

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadelli Vijith Kumar) కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో ఆది వారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 1, 22, 23, 38, 39, 55, 56 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం, మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్, నాయకులు శ్రీరాముల మల్లేష్, MD.తాజుద్దీన్, పడాల శ్రీనివాస్, పడాల రవీందర్, కర్రు శంకర్, జెట్టి చరణ్, రాపర్తి కిషోర్, జాడి కల, డివిజన్ లోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.