’సర్’పై అవగాహన కార్యక్రమం
ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): సర్ పై అవగాహన కల్పించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు సోమవారం గాంధీనగర్ డివిజన్ ఎస్‌ఆర్టీ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లోని అన్ని పార్టీల బిఎల్‌ఎ-1, బిఎల్‌ఎ -2లు పాల్గొన్నారు. జూన్ 25వ తేది నుండి మొదలుకానున్న ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం సర్ పై అధికారులు పలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్, గాంధీనగర్ డివిజన్ బిజెపి పార్టీ బిఎల్‌ఎ -2 లు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సీనియర్ నాయకులు టి, గోపాల్, రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, విఎస్టి రాజు, పీ. నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, బాల కృష్ణ, సత్తి రెడ్డి, సురేష్ రాజు, లక్ష్మణ్ యాదవ్, నర్సింహ, సాయి కుమార్, శ్రీనివాస్ యాదవ్ శైలేష్, నీరజ్, యాదగిరి, ఆర్.శ్రీకాంత్, శేషికాంత్, సంయుక్త రాణి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.






