వర్షాల కోసం శివాలయంలో ప్రత్యేక పూజలు
23-06-2026 12:16 AM
అలంపూర్, జూన్ 22: వర్షాలు కురవాలని కోరుతూ మానవపాడు గ్రామ శివారులోని శివాలయంలో సోమవారం గ్రామస్తులు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇటీవల కురిసిన తొలి వర్షానికి రైతులు పత్తి విత్తనాలు వేశారు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు సరిగా రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక ఎకరాకు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావం కారణంగా పంటల భవితవ్యంపై ఆందోళన నెలకొనడంతో రైతులు, గ్రామస్తులు శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి వరుణదేవుడి కరుణ కోసం ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జి. వెంకట్రాముడు, మద్దిలేటి, రాముడు, నాగరాజు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.






