calender_icon.png 17 May, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ

17-05-2025 12:00:00 AM

గోపాలపేట మే 17 : గోపాలపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై రాలి నిర్వహించారు. శుక్రవారం డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డాక్టర్ తన కుమారి మెడికల్ డాక్టర్ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రావడానికి కారణాలు దోమల వల్లేనని తెలిపారు. దోమలు ఉద్భవించకుండ  నివారించాలని తెలిపారు.

డెంగీ దోమలు మంచినీళ్లలో టైర్లలో ము రుగునీళ్లలో ఉద్భవిస్తాయని చెప్పారు. ఉదయం సమయంలో కుట్టే ఆడదని వల్లే డెంగ్యూ వ్యాధి వస్తుందని కాలనీవాసులకు డాక్టర్ కృష్ణకుమారి చెప్పారు.

ముఖ్యంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ముందు నీరు నిలవకుండా చూసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఏఎన్‌ఎంలు ఆశ వర్కర్లు ఉన్నారు.