17-05-2025 10:53:29 PM
చిన్న శంకరంపేట/చేగుంట (విజయక్రాంతి): శంకరం పెట్ మండల పరిధిలోని సూరారం గ్రామంలో నిర్వహించే పెద్దమ్మ తల్లి 16వ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి నేడు బండ్ల ఊరేగింపులో భాగంగా ప్రత్యేక పూజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల నాయకులు లక్ష్మారెడ్డి, అయ్యారి లక్ష్మణ్, చిలుక నాగరాజు, హేమచంద్రం, బందెల ప్రభాకర్, పడాల శ్రీనివాస్ గోవర్ధన్ రెడ్డి,సంజీవరెడ్డి సుధాకర్ నాయక్ తోట రమేష్ ప్రసాద్ గౌడ్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.