17-05-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు
సూర్యాపేట, మే 16 (విజయక్రాంతి) : ధాన్యం త్వరిగతిన కాంటాలు వేసి మిల్లులకి తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే రాయినిగూడెం -2, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బాలెంల 2, పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎర్కారం, పిల్లలమర్రి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి అయిందని మిగిలిన ధాన్యాన్ని సాధ్యం అయినంత త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తామన్నారు. లారీలను సర్దుబాటు చేసి కొనుగోలు కేంద్రాలకి పంపిస్తామని, ఆకాల వర్షాలకి వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని మూడు రోజులలో కాంటాలు వేసి ధాన్యం మిల్లులకి తరలించాలని సూచించారు. తదుపరి తిరుమలగిరి మండలంలోని ఎ ఎస్ ఆర్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన లారీలను ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈయన వెంట తహసీల్దార్లు శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్, సెంటర్ ఇంచార్జి ఫణీమా, పుష్ప లత, వెంకటరెడ్డి, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.