17-05-2025 10:51:27 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుధ గ్రామంలో అనుమానాస్పద మృతి కేసులో ఒకరినీ తాళ్ల గురజాల పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అఫ్జలుద్దీన్ తన కార్యాలయంలో శనివారం వివరాలను వెల్లడించారు. పెద్దబూద గ్రామానికి చెందిన ఊరడి లక్ష్మణ్, ఉరడి లచ్చయ్యల మధ్యలో నాలుగు గంటల భూమి గురించి గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 8 తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఉరడి లక్ష్మణ్, లచ్చయ్య ఇంటికి వెళ్లి భూమి గురించి రోడ్డుపై అడిగాడు. మధ్యలో జోక్యం చేసుకొని లచ్చయ్య కొడుకు శంకర్, దుర్భాషలాడుతూ నీకు భూమి ఎక్కడిదనీ తిడుతూ కడుపులో పిడికిలితో పిడిగుద్దులు గుద్దాడు.
ఇంతలో లక్ష్మణ్ కొడుకు రమేష్ వచ్చి లక్ష్మణ్ ను అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత రాత్రి ఒంటి గంటకు కడుపు నొస్తుందనీ చెప్పగా అతని కొడుకు రమేష్ ఆర్ఎంపీ దగ్గరకి తీసుకువెళ్లి ఇంజక్షన్ ఇప్పించాడు. మరుసటి రోజు కూడా లక్ష్మణ్ కు కడుపు నొప్పి రావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కికెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాల హాస్పిటల్కీ వెళ్ళాడు. మంచిర్యాల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తేదీ 13న లక్ష్మణ్ మృతి చెందాడు. దీనిపై అతని కొడుకు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ మృతి అనుమానాస్పదమైందిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి డాక్టర్ ఇచ్చిన PMR బేస్ చేసుకుని సెక్షన్ ఆల్టర్ చేసి నిందితుడిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్లు సిఐ వెల్లడించారు.