17-05-2025 10:47:58 PM
- తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు
- పాలమూరు పట్టణంలోని సర్వేనెంబర్ 272 పై ఇప్పటికే హైకోర్టులో కోసులు
- ప్రకటన రిలీజ్ చేసిన పట్టణవాసులు గోపాల్ కృష్ణ, శ్రీనివాస్ గౌడ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ పట్టణంలోని నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 272 కు సంబంధించిన భూముల విషయంలో సర్వహక్కులు మాకు ఉన్నాయని పట్టణానికి చెందిన గోపాలకృష్ణ, శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. 272, 272/1 లో గల భూములు పూర్తిస్థాయిలో నిబంధనల మేరకు మాత్రమే ఉన్నాయని, కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులు వేయడం జరిగిందని, ఇలాంటి ఇబ్బందులు ఉన్న మ్యాప్ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
నిబంధనలకు లోబడి లేకుండా దూరంగా ఉన్నవారు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములపై కన్ను వేశారని ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఎవరి దగ్గర ఏ కాగితాలు ఉన్నప్పటికీ నిజాయితీగా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ భూముల విషయానికి సంబంధించి సరియైన ధ్రువీకరణ పత్రాలు పూర్తిస్థాయిలో తమ దగ్గర ఉన్నాయని, భూ హక్కుదారులు కూడా తమకు పూర్తిగా లీగల్ గా విక్రయించడం జరిగిందని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ఎవరు నమ్మకూడదని తెలియజేశారు.