17-05-2025 10:45:55 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబాల రాజు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వర్షాకాలంలో హైదరాబాద్ జలమయం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు.
అక్రమ నిర్మాణాల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ సంస్థ ఏర్పాటు చేసి, అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారని అన్నారు. ఈ చర్యలను తప్పుగా వివరించడం బాధాకరమని, ఇటువంటి వ్యాఖ్యలు రాజేందర్ లాంటి అనుభవజ్ఞుడికి తగవని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఎగ్గేటి సదానందం, ఉప్పుల సాంబశివరెడ్డి, మ్యాకమల్ల అశోక్, కాయిత లింగారెడ్డి, బండి కుమారస్వామి, పల్లకొండదానందం,తోపాటు తదితరులు పాల్గొన్నారు..