calender_icon.png 18 May, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం అభివృద్ధి చేయడమే రాజ్ ఠాకూర్ లక్ష్యం

17-05-2025 11:00:25 PM

దుర్గనగర్ లో ఒకే చోట రూ. 50 లక్షలతో పార్క్ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్..

రామగుండం (విజయక్రాంతి): రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయడమే రాజ్ ఠాకూర్ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్(MLA Makkan Singh Raj Thakur) అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో పార్కుల సుందరీకరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ అరుణ శ్రీతో కలిసి పలు అభివృద్ధి పనులకు సామూహికంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించేందుకు పార్కులు ఎంతో అవసరమని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడుతూ... ప్రజలకు విహారానికి, వ్యాయామానికి అనువైన వాతావరణం అందించేందుకు ఈ సుందరీకరణ పనులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.