17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

స్వర్ణాల దిశగా ఆయు కుమార్, సాక్షి చౌన్కర్

14-06-2025 12:00 AM

ముషీరాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి) : హుస్సేన్‌సాగర్ లేక్‌లో జరుగుతున్న మాన్సూన్ రెగట్టా చాంపియన్షిప్ గ్రీన్ ఫ్లీట్ విభాగంలో ఆయు కుమార్, సాక్షి చౌన్కర్ దూసుకెళ్తున్నారు. తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ దత్తత తీసుకున్న హర్యానాకు చెందిన ఈ ఇద్దరు సెయిలర్లు స్వర్ణ పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. ఆయు కుమార్ బాలుర విభాగంలో అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సాక్షి మొదటి స్థానంలో ఉంది.

ప్రతి కూల వాతావరణం నేపథ్యంలో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చతుర్వేది గురువారం ఉదయం సెషన్లో అతి కష్టం మీద ఒక్కో రేసును మాత్రమే నిర్వహించగలిగారు. అయితే, ఈ రేసు తర్వాత ఒక్క సారిగా నిరసనలు రావడంతో అండర్-19 29 ఇఆర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న తంగై, దివాకర్లపై జ్యూరీ అనర్హత వేటు వేసింది.

మికస్డ్ డబుల్స్ ఈ వెంట్లో తనుజ-శ్రవణ్ జోడీ తమ విజయ పరంపరను కొనసాగించింది. బాలికల విభాగంలో జరిగిన ఏకైక రేసులో ఆలియా సబ్రీన్, అండర్-18 లేజర్ విభాగంలో శరణ్య యాదవ్ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచారు. సాయం త్రం పోటీలు పూర్తిగా రద్దయ్యాయి.