17 April, 2026 | 10:13 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రేపే రక్తదాన శిబిరం

13-06-2025 11:00 PM

ఉత్తమ రక్తదాతల పురస్కారాల కార్యక్రమం..

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్  (ఐవిఎఫ్) 12 వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 14 నుండి జూలై 6 వరకు జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతీయ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా  సహకారంతో తెలంగాణ సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే రేపు ఉదయం 09 గంటలకు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని అన్నారు. 

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్ మరియు యూత్ విభాగం ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో మూడు సార్లు రక్తదానం చేసిన ఉత్తమ రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను,రక్తదానం చేసిన రక్త దాతలకు ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మధ్యాహ్నం ఒకటి గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ ఆర్ ఆర్ వరప్రసాద్, న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి, ప్రముఖ సమాజ సేవకులు గౌతమ్ లు రావడం జరుగుతుందని అన్నారు. రక్తదానం చేయాలనుకున్నవారు 9492874006 నంబర్ కి సంప్రదించాలన్నారు.