19-12-2025 12:05:03 AM
చర్ల, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులను గురువారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ .చర్ల మండల పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్ల మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ అత్యధికంగా 9 పంచాయతీల్లో విజయం సాధించిన ఈ సందర్భంగా డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను వార్డు మెంబర్ లను, ఈ విజయానికి కష్టపడి పని చేసేన సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని, రానున్నది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే అని కాబట్టి ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
మండలంలో రాబోవు ఎం పి టి సి, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రతి సెగ్మెంట్లో స్థానిక యువ నాయకత్వం కస్టపడి పనిచేసి ఇదే స్పూర్తితో మెజారిటీ స్థానాలు గెలిచేవిధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, మరియు వార్డు మెంబెర్స్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.