calender_icon.png 19 December, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేర్లు మార్చడంలో దొందూ దొందే

19-12-2025 12:00:00 AM

  1. ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగించడం క్షమించరాని నేరం
  2. కేసీఆర్ హుందాతనాన్ని చూసి నేర్చుకోండి: కేటీఆర్  

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాం తి): పథకాల పేర్లు మార్చడంలోనూ, వాటిని నిర్వీర్యం చేయడంలోనూ కాంగ్రెస్, బీజేపీ ‘దొందూ దొందే’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జాతీయ ఉపా ధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు ను తొలగించడం ద్వారా బీజేపీ తన సంకుచితత్వాన్ని చాటుకుందని, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరి స్తోందని మండిపడ్డారు.

జాతిపిత పేరును తొలగించిన బీజేపీకి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు. పేదలకు రూ. 5లకే భోజనం అందించే ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ పేరును ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’గా మార్చడం చిల్లర రాజకీయమని కొట్టిపారేశారు. ప్రజలు త్వరలోనే ఈ రెండు పార్టీల భరతం పడతారని హెచ్చరించారు.