19-12-2025 12:04:51 AM
భారత్‌లో మాత్రమే స్థిరమైన ఆర్థిక పురోగతి
మరింత మెరుగ్గా ఒమన్‌తో స్నేహ బంధం
ఒమన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
పలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు
మోదీకి ’ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను పురస్కారం ప్రదానం
మస్కట్, డిసెంబర్ 18 : ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒమన్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన మైత్రీపర్వ్ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా యని తెలిపారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా కనీస వృద్ధిని సాధించేందుకు ఇబ్బంది పడుతున్న వేళ..
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని తెలిపారు. అందుకు భారత దేశ వృద్ధి రేటు 8శాతం కంటే ఎక్కువగా ఉండడమే నిదర్శనమన్నారు. ఇది గొప్ప విషయమని పేర్కొ న్నారు. ఇరుదేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అయిందన్నారు.
ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
భారత్-ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశా ల మధ్య రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
12 బిలియన్ డాలర్ల వాణిజ్యం
భారత్-,ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమన్, భారత సముద్ర భద్ర తా వ్యూహా భాగస్వామి.
అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదే పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసా లు, నౌకాదళ మరింత పెరగనున్నాయి. ఒమ న్లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు.
వారి సంక్షేమం, ఉదో నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుప క్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాల ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి. అంతకుముందు మస్కట్‌లో ప్రధాని మోదీకి సాంప్ర దాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హైతమ్‌తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఒమన్- భారత్ సంబంధాలు మెరుగు
“సముద్రం రెండు చివర్లా చాలా దూరం లో ఉంటాయని.. అయితే అరేబియా సము ద్రం మాండవి.. మస్కట్ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను.. సంస్కృతిని, ఆర్థిక వ్యవవస్థను బలో పేతం చేసింది. ఈరోజు పూర్తి విశ్వాసంతో చెప్పగలం. సముద్రపు అలలు.. వాతావరణం మారినప్పటికీ.. భారతదేశం, -ఒమన్ మధ్య స్నేహం ప్రతి అలతో పాటు మరింత బలపడుతోంది.” అని మోదీ అన్నారు. భారత్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్ను మోదీ తిలకించారు.
ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ’ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.భారత్-ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన చౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలకు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.