calender_icon.png 17 November, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా 14వ అయ్యప్ప పడిపూజ

17-11-2025 06:41:53 PM

అమీన్ పూర్: హరిహరపుత్ర అయ్యప్ప స్వామి 14వ మహాపడి పూజ వైభవంగా జరిగింది. స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ఆలపించారు. అమీన్ పూర్ పట్టణ పరిధిలో బీరంగూడ మల్లికార్జున హిల్స్‌లో నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 14వ మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. కన్నె స్వామి నందారం భరత్ గౌడ్, సందీప్ గౌడ్ సాన్నిధ్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణాన్ని నిండా పూరించారు.

కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి గంగాపుత్ర నర్సింగ్ రావు వారి బృందం ఆలపించిన భక్తిరస గానాలు భక్తులను మైమరిపించాయి. అనంతరం నిర్వహించిన మహా పడిపూజలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ మాట్లాడుతూ... అయ్యప్ప మాలాధారణ దీక్షతో హృదయం పవిత్రంగా మారుతుందని, మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల రాజకీయ నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వామిలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు, నాయకులు,  మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.