calender_icon.png 17 November, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

17-11-2025 06:39:28 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని సోమవారం రోజున జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ (ఎఎల్ఓ) రఫీఅహ్మద్, చక్రధర్ రెడ్డిలకు జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘo( ఏఐటియుసి)రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ సంక్షేమ బోర్డు స్కీములను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని సంహరించుకొని సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలన్నారు. 

సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రెన్యువల్ కానీ 13 లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులు వెంటనే రెన్యువల్ చేయాలని పెండింగ్ క్లీన్సును నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేబర్ ఆఫీసులో గుర్తింపు సంఘాలను అనుమతిస్తూ ప్రవేట్ సంఘాల పేరుతో వస్తున్న వారిని అరికట్టాలని వెల్ఫేర్ బోర్డులో గుర్తింపు సంఘాల సభ్యులతో అడ్వైజర్ కమిటీ ద్వారా నిధులను మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్య, ఆకుల మల్లేష్, బొంకూరి రాములు,జిందం ప్రసాద్, రేగుల కుమార్, జి కొమురయ్య, కసిబోసుల సంతోషచారి, పిట్టల శ్రీనివాస్, సదానందం, నూనె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.