29-06-2025 02:00:46 AM
కోల్‌కతా, జూన్ 28: భారత నాలుగో అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’ అందుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్తిక్ మహరాజ్ అనే బాబా ఆశ్రమంలోనే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక మహిళ ఆరోపించింది. నిందితుడు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి 2013 నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. బీజేపీకి అత్యంత సన్నిహితుడయిన ఆ బాబా ఈ ఆరోపణలను ఖండించారు.
ముర్షిదాబాద్‌లో తనకు భారత్ సేవాశ్రమ్ సంఘ పేరిట ఉన్న ఆశ్రమంలోకి తీసుకెళ్లి అనేక సార్లు అత్యాచారం చేసినట్టు వెల్లడించింది. జనవరి 2013 నుంచి ఆరునెలల కాలంలో ఆ బాబా తనపై కనీసం 12 సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమహిళ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను కార్తిక్ మహరాజ్ బాబా ఖండించారు. ఆ మహిళ ఆరోపణల మేరకు కార్తిక్ మహరాజ్ మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.