calender_icon.png 13 October, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుక్కల మందు వికటించి శిశువు మృతి!

13-10-2025 01:35:08 AM

  1. మరో చిన్నారికి సైతం వాంతులు

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రలో ఘటన 

కంగ్టి (నారాయణఖేడ్), అక్టోబర్ 12(విజయక్రాంతి): పోలియో చుక్కలు వికటించి మూడు నెలల శిశువు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియో జకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని భీమ్ర గ్రామంలో ఆదివారం చోటుచేసుకుం ది. స్థానికులు, బాధితురాలు కథనం ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్రా గ్రా మానికి చెందిన స్వర్ణలత, మహేశ్‌లకు చెంది న మూడు నెలల శిశువుకు మధ్యాహ్నం గ్రా మంలోని పోలియో కేంద్రానికి వెళ్లి పోలి యో డ్రాప్స్ వేయించారు.

వారు తమ ఇంటి కి వెళ్లేలోపే శిశువు వాంతులు చేసుకోవడం, తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తలి స్వర్ణలత వెంటనే స్థానిక వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని నిర్వహకులకు తెలిపేలోపే శిశువు మృతి చెందినట్లు పేర్కొన్నారు.  పోలియో చుక్కలు కారణంగానే తమ బాబు మృతి చెందాడని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై కంగ్టి పీహెచ్‌సీ నాగమణిని వివరణ కోరగా సంఘటనపై వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా గ్రామంలో మరో తొమ్మి ది నెలల పాప నిషా సైతం వాం తులు, విరేచనలతో బాధపడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఏది ఏమైనా పోలియో చుక్కల కారణంగా చిన్నారి మృతి చెందడం పట్ల నా రాయణఖేడ్ నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. కాగా సంబంధిత వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాం టి సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులపై తగు చ ర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.