calender_icon.png 3 July, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎస్ రద్దు చేయాలి

02-07-2025 09:13:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్(District Secretary Rachakonda Upender) డిమాండ్ చేశారు. టి.పి.టి.ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని బాలికోన్నత పాఠశాల, నంది నగర్, అనంతారం, గాంధీపురం, బేతోల్, మాధవాపురం, మల్యాల తదితర పాఠశాలలను సందర్శించారు.

ఈ సందర్భంగా బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సిపిఎస్ రద్దు కొరకు ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడం విచారకరమన్నారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు పోరాటం చేస్తుంటే  కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యుపిఎస్) 2025 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నదని, ఈ పథకం పాత పెన్షన్ విధానానికి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు.

ఉద్యోగులు ఐక్యంగా బలమైన ఉద్యమ కార్యకరణతో సిపిఎస్ రద్దు అయ్యి వరకు పోరాడవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మహబూబాబాద్ మండల అధ్యక్షులు ఘనపురం బిక్షపతి, ప్రధాన కార్యదర్శి సారెడ్డి రామలింగారెడ్డి, బాలికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వర్లు, పి.హరిణి, పి.అనసూయ, జె.నాగలక్ష్మి, కె.గిరిజ, టి.పద్మావతి,డి విజయలక్ష్మి, జి.శ్వేత, మంజుల రాణి, బి.మంగీలాల్, దబ్బ నరేష్, సోమ రవి, ఎం.డి రఫిక్, సోమ శ్రీనివాస్, పి.ధనుంజయ నాయుడు పాల్గొన్నారు.