calender_icon.png 3 July, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్

02-07-2025 09:03:07 PM

హుజూర్ నగర్: పేద ప్రజల వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్(CMRF) అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు(Congress Party President Thanniru Mallikarjuna Rao) అన్నారు. బుధవారం పట్టణంలోని 14 వార్డుకు చెందిన గడ్డం వెంకాయమ్మ రాతికింది సావిత్రమ్మలకు 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ దేశచరిత్రలో చారిత్మాత్మకం అన్నారు. అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ వైపు నేడు దేశం మొత్తం చూస్తుందన్నారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు సకాలంలో అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు, వార్డు ఇంచార్జి కోల్లపూడి యోహాన్, రాతికింది వెంకన్న, సురభి రంగ, తదితరులు పాల్గొన్నారు.