02-07-2025 08:38:44 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, ఇష్టంతో చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం గిరిజన బాలికల పాఠశాల/జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, బాలికల భద్రత, మత్తు పదార్థాలు, వాటి పర్యవసానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, తమ జీవితాలను సక్రమ మార్గంలో మలుచుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
వాహనాల తనిఖీ
కేసముద్రం పట్టణంలో పోలీసులు ప్రత్యేకంగా వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరు నియమాలు తప్పకుండా పాటించాలన్నారు.