calender_icon.png 3 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘరానా మోసం

02-07-2025 08:53:45 PM

ఫించన్ ఎక్కువ ఇప్పిస్తా అంటూ 2 తులాల బంగారు గొలుసు చోరీ చేసిన అగంతకుడు..

మనోవేదనతో బక్క చిక్కి శల్యమైతున్న వృద్ధురాలు..

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాల్ పల్లికి చెందిన వితంతు వృద్ధురాలు చెప్యాల లలితా అనారోగ్యంతో బాధపడుతూ మందుల కోసం తూప్రాన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకుని తిరిగి స్వగ్రామం పడాల్ పల్లికి వెళ్ళడానికి ఆటో స్టాండ్ కు చేరుకోగా ఒక గుర్తు తెలియని అగంతకుడు హైటెక్ తరహా మోసం చేసి రెండు తులాల బంగారు గొలుసు అభరణాల దొంగిలించిన సంఘటన బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ ఆటో స్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీ కోసం మీ ఇంటికి వెళ్లి వచ్చాము, మీకు ఫించన్ డబ్బులు నాలుగు వేలు వచ్చాయి మీకు రెండు వేలు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ నెల నుంచి నేను మీ ఊరికి వచ్చి ఇస్తామని నమ్మించాడు. నీ ఫోటోలో గొలుసు ఉంది. స్వరూప మెడలో గొలుసు లేదు ఆమె మెడలో గొలుసు వేసి ఫోటో తీసి పంపిస్తా అని చెప్యాల లలితా మెడలో ఉన్న గొలుసు ఇవ్వమంటే అతనికి ఇవ్వకుండా వెంట ఉన్న స్వరూపకు ఇచ్చి అతని వెంట పంపించింది.

కాగా కొద్ది దూరం వెళ్లగా స్వరూప చేతిలోని బంగారు గొలుసు లాక్కొని దొరకకుండా వేగంగా పరిగెత్తి దొంగలించుకొని వెళ్ళాడు. కాగా ఈ విషయమై తూప్రాన్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తు సీసీ కెమెరాలు పరిశీలించి అగంతకుణ్ణి గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఫించన్ ఎక్కువ ఇప్పిస్తా అంటూ 2 తులాల బంగారు గొలుసు చోరీ చేయడంతో తిండి తింటే పెయిన పడతా లేదు - పంటే నిద్ర పడతా లేదు అంటూ మనోవేదనతో బక్క చిక్కి శల్యమైతున్న వృద్ధురాలును చూసి అయ్యో పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పరామర్శించిన వృద్ధురాలు ఏడుస్తూ కన్నీరు మున్నీరు పెడ్తూ దండం పెడతా పోలీస్ సార్లు జర ఎట్లనన్న చేసి దొంగను పట్టుకొని నా గొలుసు నాకు ఇప్పించండి సార్లు అంటూ వేడుకుంటుంది.