calender_icon.png 3 July, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

02-07-2025 08:34:28 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) మాట్లాడుతూ... వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, పట్టణ, గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని ఎంఈఓ, మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. అంతేకాకుండా గ్రామపంచాయతీలలో ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలన్నారు.

వర్షాకాల దృష్ట్యా ప్రజలకు చికెన్ గున్యా, డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి గురువారం పరిసరాలను పరిశీలించాలన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్(Commissioner Chahat Bajpai) మాట్లాడుతూ... మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల  ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

వందరోజుల ప్రణాళికను రూపొందించి 24/7 పనిచేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, నిర్మాణ సామగ్రి రేట్లు, వన మహోత్సవం, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ కాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.