calender_icon.png 3 July, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్సీ

02-07-2025 09:07:43 PM

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నిజాం కుటుంబాన్ని పరామర్శ..

హుజూర్ నగర్: మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నిజాముద్దిన్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి(MP Kunduru Raghuveer Reddy), ఎమ్మెల్సీ శంకర్ నాయక్(MLC Shankar Naik) అన్నారు. మండల పరిధిలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం వారి నివాసానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్ సహకారంతో నిజాముద్దీన్ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సాముల శివారెడ్డి,చక్కెర వీరారెడ్డి, అరుణ్ కుమార్ దేశ్ముఖ్, దొంగరి వెంకటేశ్వర్లు, ఎండి అజీజ్ పాషా, దొంగరి సత్యనారాయణ, మంజు నాయక్, సుబ్బరాజు, గంజి శివ, తదితరులు, పాల్గొన్నారు.