calender_icon.png 3 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లా రాజేశ్వర్ రెడ్డికి గజమాలతో సత్కరించిన బచ్చన్నపేట బిఆర్ఎస్ నాయకులు

02-09-2025 05:38:57 PM

బచ్చన్నపేట,(విజయక్రాంతి): జనగామ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇటీవల ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత మొదటిసారిగా బచ్చన్నపేట మండలానికి వచ్చిన సందర్భంగా పోచన్నపేట గ్రామం నుంచి బచ్చన్నపేట టౌన్. దాటే దాకా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి బచ్చన్నపేట మండలంలో ప్రతి గ్రామం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మీటింగులు పెట్టిన కెసిఆర్ బచ్చన్నపేట గురించి ప్రస్తావించాడని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ కాగానే గోదావరిజాలలతో బచ్చన్నపేట గుడి చెరువు నింపడం జరిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం వద్దని బనకచర్లకు గోదావరి జలాలు తరలించూకపోతున్న ఇక్కడ నేతలు పట్టించుకోవడంలేదన్నారు. మన నీళ్లను చంద్రబాబు దోచుకే కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉన్నప్పటి పదేళ్లలో ఏ రోజన్న రైతుల యూరియా కోసం రోడ్ ఎక్కారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు కష్టాలు మొదలు అవుతున్నాయని అన్నారు.