calender_icon.png 3 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి

02-09-2025 05:43:11 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్స్, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేకపోవడంతో బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ సమీక్ష నిర్వహించకపోవడం దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిందన్నారు.రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యాశాఖమంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న ఉద్యమాలను పోరాటాలను అణచివేయాలని చూస్తుంది తప్ప సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.

స్థానిక కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామాల్లో పనుల పండుగ కాకుండా విద్యాసంస్థలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు తరగతి గదులు లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందన్నారు. 2016- 17 లో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలు ఇప్పటికీ అమలు చేస్తూ పెంచలేని పరిస్థితి ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. 

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో అయినా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియాబర్స్మెంట్లను ఈ అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేసేలా ప్రకటన చేయాలని ఎస్ఎఫ్ఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల భవిష్యత్తులో చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని, జిల్లాలో ఉన్న విద్యార్థులు అందరిని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.