11-02-2025 12:12:15 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 10 : రోడ్లపైనే నిర్మాణ సామాగ్రి ఉంచడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆల్కపూరి కాలనీలో ఉన్న రోడ్ నెంబర్ 22 లో కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై ఇసుక, కంకర, స్టీలు రాడ్లు ఉంచడంతో వాహనదారులు, అదేవిధంగా నడుచుకుంటూ వెళ్లేవారు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు.
మణికొండ మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అడ్డ గోలుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారు లు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.