09-05-2025 03:14:38 AM
న్యూఢిల్లీ, మే 8: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల్లో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో చినాబ్‌నదిపై నిర్మించిన బాగ్లిహర్ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్ట్ రెండు గేట్లను గురువారం భారత ప్రభుత్వం తెరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందడంతో భారత ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని విరమించుకుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజె క్ట్‌ల ద్వారా పాక్‌కు వెళ్తున్న జలాలను భారత ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా నీటి నిల్వ పెరగడంతో దిగువకు నీళ్లు వదలాల్సి వచ్చింది.