calender_icon.png 9 May, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు సెలవులు రద్దు

09-05-2025 03:20:50 AM

  1. భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం
  2. పంజాబ్‌లో పాఠశాలల మూసివేత

న్యూఢిల్లీ, మే 8: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర ప్రతిస్పందనకు సంసిద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం రాత్రి అత్యవసరంగా భేటీ అయిన ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలంటూ సేవా విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఆరోగ్యం, విపత్తు నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడానికి అన్ని జిల్లా న్యాయాధికారులు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఇక పంజాబ్‌లో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్, హర్యానాలోని పంచ కులలోనూ పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.