24-11-2025 12:51:51 AM
మహిళలకు పెద్దపీట
మహబూబాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఏఐసీసీ శనివారం రాత్రి ప్రక టించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్లో ఉ మ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ విధేయులకు పట్టం కట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పాత కాపులకు ప్రాధా న్యం ఇచ్చారని, మహిళలకు పెద్దపీట వేశారని, కులాలవారీగా సమతూకంగా వ్యవహ రించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి.
అయితే ఊహించని రీతిలో కొన్నిచోట్ల డీసీసీ అధ్యక్ష పదవులను కొందరు దక్కించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆశ్చర్యం వ్య క్తం అవుతోంది. ములుగు డీసీసీ అధ్యక్ష పద వి ముందుగా ఊహించినట్లుగానే మంత్రి సీ తక్క అనుచరుడు, ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కు దక్కినట్లు చె బుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రె స్ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య ము రళి నాయక్ సతీమణి డాక్టర్ ఉమకు కట్టబెట్టారు.
మురళి నాయక్ తండ్రి మంగ్యా నా యక్ నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నారనే గుర్తింపు ఉం ది. ఈ క్రమంలో ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి ఆశీస్సులు దండిగా ఉండడంతో ఆయన ఆ రోగ్య రీత్యా డీసీసీ అధ్యక్ష పదవి నుంచి త ప్పించి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఉ మకు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి ముస్లిం మైనార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు అయ్యూబ్ కు కట్టబెట్టారు. అలాగే జనగామ జిల్లా అధ్యక్ష పదవిని ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ లకావత్ ధన్వంతికి ఇచ్చారు. ఇదేవిధంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కూ డా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డికి అవకా శం కల్పించారు. వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయుడుగా గుర్తింపు ఉంది.
పరకాల శాసనసభ స్థానం నుండి పోటీ చేసి పరాజ యం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ యనకు పరకాల అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కూడా చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్ష పద వి కూడా ఆయనకు కులాల ప్రాతిపదికన ఓసి కేటగిరీకి చెందిన ఆయనకు లభించిన ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు డీసీసీ అధ్యక్ష పదవులను పూర్తిగా పార్టీకి విధేయతగా ఉంటు న్న సీనియర్ నాయకులకు అవకాశం కల్పించినట్లు ప్రచారం సాగుతోంది.