24-11-2025 12:00:00 AM
-కింగ్ ఎవరు.. ఏమి జరుగుతుందంటూ విచారణ షురూ!
-కింగ్‌ను కాపాడే ప్రయత్నంలో మున్సిపల్ కమిషనర్
-ఆయనకు అంత ప్రియారిటి ఎందుకు అంటున్న జడ్చర్ల జనం
-కింగ్ వివరాలు అరా తీస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
-సరి చేసుకుంటాం: లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల, నవంబర్ 23: మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కింగ్ కలవర పడుతున్నారు. విజయ క్రాంతి దినపత్రిక వరుస కథనాలతో జడ్చర్ల మున్సిపాలిటీలో జరుగుతున్న లోపాయికారి అంగీకారాలను వెలుగులోకి తీసుకురావడంతో జిల్లావ్యాప్తంగా ఈ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందని చర్చ ఊపందుకుంది. స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన కమిషనర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని జడ్చర్ల పట్టణవాసులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ తీవ్రంగా కలవరపడుతుంటే మున్సిపల్ కమిషనర్ ఏమి పరవాలేదంటూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారంట.
ఇప్పటికే కింగ్ ముందుకు సాగాలని ప్రత్యేకంగా పలువురుతో చర్చించినట్లు తెలుస్తుంది. విధి నిర్వహణలో పై అధికారుల పనులు కూడా తామే చేస్తామంటే ఆయా అధికారులు ఎందుకు ఉండాలో ఆ మున్సిపల్ కమిషనరే చెప్పాల్సిన అవసరం ఉందని కార్యాలయ సిబ్బంది, జడ్చర్ల జనం చెబుతున్న మాట. ఈ వ్యత్యాసాలకు ముగింపు పలికేందుకు ఉన్నత అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండ్రు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఏమి జరుగుతుంది అనే విషయాలను ఇప్పటికే సంబంధిత అధికార యంత్రం ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.
విచారణ షురూ...
జడ్చర్ల మున్సిపాలిటీలో కమిషనర్ కే సలహాలు ఇచ్చే ఆ కింగ్ ఎవరు అంటూ ఇప్పటికే విచారణ సులువు అయింది. మున్సిపల్ కమిషనర్ ఆ కింగ్ ను కాపాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, ఇందుకు గల కారణాలు ఏంటి ఇప్పటివరకు పై అధికారికి తెలియకుండా జరిగిన ఫైళ్ళకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.
ఫోటో కాల్ ప్రకారం కార్యాలయ ప్రక్రియలు టేబుల్ టు టేబుల్ మారకుండా నేరుగా కింది టేబుల్ నుంచి ఫై టేబుల్ కే ఫైల్స్ ఎందుకు వెళ్తున్నాయని, నిబంధనలు ఆ మున్సిపాలిటీకి పట్టావా? అంటూ ఉన్నత అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే అవినీతి అక్రమాలకు తావు లేకుండా నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని నిరంతరం చెబుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
మున్సిపాలిటీలో జరగాల్సిన పనులు నిబంధనలకు దూరంగా జరుగుతున్నాయని విషయాలు ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అవినీతి అక్రమాలతో పాటు వివిధ కారణాలతో కొంతమంది అధికారులను బదిలీ చేయించడంతోపాటు సస్పెండ్ చేయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. నిబంధనలు దూరంగా ఉంటే పక్కాగా కింగ్ పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కార్యాలయ అధికారులతో పాటు జడ్చర్ల మున్సిపల్ జనం చెబుతున్న మాట.
అక్కడ నిబంధనలు ఎప్పుడు అమలు అవుతాయి..
ఈ అంశంపై పక్కాగా ఆధారాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన ఫైలు ప్రక్రియలో బాధ్యత గల అధికారుల సంతకాలు లేకుండానే కొన్ని అడుగులు వేసినట్లు తెలుస్తుంది. కింది స్థాయి అధికారి నుంచి నేరుగా పై స్థాయి అధికారికి ఫైళ్ల ప్రక్రియ జరగడంతో ఫోటో కాల్ తో పాటు నియమ నిబంధనలు అక్కడ పనిచేయవు అనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ఉన్నత అధికారులు సైతం జడ్చర్ల మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం విచారణ అయ్యే అవకాశాలు కు మరింత బలం చేకూరుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తిస్థాయిలో విచారణ ముగింపు పలికితే తప్పిదాలు చేసిన అధికారిపై పక్కాగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కార్యాలయ సిబ్బందితోపాటు పట్టణవాసులు చెబుతున్న మాట.
సరి చేసుకుంటాం...
ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరిగాయి పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. వాటి అన్నిటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పగిస్తాం.
- లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్ జిల్లా