24-11-2025 12:49:23 AM
- మోదీ ప్రభుత్వం చర్యలు ఆప్రజాస్వామి కం..
- కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తిరగడబతాం
- సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు
- మణుగూరులో ఘనంగా ప్రారంభమైన సిఐటియు జిల్లా మహాసభలు
మణుగూరు, నవంబర్ 23 ( విజయక్రాం తి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసు కొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్లు దేశం లోని కార్మి కులకు ఉరితాళ్లుగా మారుతు న్నాయని, కార్మికుల హక్కులను కాలరా సే ఆ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించి, కార్మికుల సమస్యలు పరిష్కరించా లని, ప్రభుత్వ రంగ సంస్థల ను పరిరక్షించాలని,సెంటర్ ఆఫ్ ఇండియ ట్రేడ్ యూని యన్ సిఐటియు అఖిల భార త కోశాధికారి ఎం సాయిబాబు డిమాండ్ చేశారు ఆదివా రం యూనియన్ భద్రాద్రి జిల్లా నాలుగ వ మహాసభలు కూకట్ల శంకర్ నగర్ లోని ఎర్ర శ్రీకాంత్ ప్రాంగణం లో కొలగాని బ్రహ్మచారి అధ్యక్షతన ఘ నంగా ప్రారంభ మ య్యాయి.
ముందుగా సిఐటియు సీనియర్ నాయకులు ఎంవి అప్పారావు జెండా ఆవిష్కరించగా, అమ ర వీరులకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి మధు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం జిల్లా మ హాసభల ను సాయిబాబు ప్రారంభించి మా ట్లాడా రు .కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని, కార్మి కు ల, రైతుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థ లను అదానీ, అంబానీలకు దారాద త్తం చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుడి కి కష్టం వస్తే సమ్మె చేసే అవకాశం లేకుం డా చేస్తోందని, సంఘాలు పెట్టుకునే విధా నాన్ని కాలరాస్తోందని, ఉద్యోగులను పర్మి నెంట్ చేసే అవకాశాలను రద్దుచేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో 50 కోట్ల కార్మికుల మనో భావాల ను దెబ్బతీసే విధంగా వారి హక్కులను హరించేందుకు ప్రస్తుతం కేం ద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రం లో రేవంత్ రెడ్డి కా ర్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇన్సూరెన్స్, టెలికాం రంగా లను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు.
బ్యాంకుల్లో సైతం ప్రైవేట్ పెట్టు బడుదా రులను పెద్ద ఎత్తున ఆహ్వానించడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల పొట్ట కొట్టార ని గుర్తు చేశారు. తెలంగాణ లో అంగ న్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికు లు, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ల తోపా టు అనేక రంగాల పార్ట్ టైం ఉ ద్యో గుల గౌరవ వేతనం పెంచడం లేదన్నా రు. హ క్కుల కోసం ధర్నాలు చేసే వారిపై ఉక్కు పాదం మోపడం ఈ ప్రభుత్వాలకు అల వాటుగా మారిందని ఆరోపించారు.
స మ్మె చేయడం కార్మికుల హక్కు అని, దానిని ఎవరు హరించినా పాతరే స్తామని ఘాటు గా వ్యాఖ్యానించారు. కార్మికులకు గొడ్డలి పెట్టుగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని, డిమాండ్ చేశారు. లేకుం టే ప్రధాని మోదీ ని గద్దె దించేవర కూ విశ్రమించబోమని స్పష్టం చేశారు.
ఈ మహాసభ లలో వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి మచ్చ వెంకటేశ్వ ర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ జే రమేష్, కే బ్రహ్మచారి ,ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లూరి నాగే శ్వరరావు,రుద్ర నాగరాజు,చిట్టిబాబు, జిల్లా నాయకులు జి పద్మ, ఎం వి అప్పా రావు, అర్జున్, గద్దల శ్రీనివాసరావు, వెంక టమ్మ, ఎస్ ఏ నబి, రవికుమార్, సత్య, వెంకట రాజు, నర్సారెడ్డి,రవి, ఆహ్వాన సంఘం కోశాధికారి సత్రపల్లి సాంబశివరా వు, సిఐటియు మండల కన్వీనర్ కొడిశా ల రాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, హెవీ వాటర్ ప్లాంట్ ఎస్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి పోతురాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.