calender_icon.png 30 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులపై బల్దియా ఫోకస్

30-08-2025 02:23:49 AM

-నేటి నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఇంటింటా ఫీవర్ సర్వే 

-పకడ్బందీగా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు 

హైదరాబాద్ సిటిబ్యూరో ఆగస్టు 29 (విజయక్రాంతి): నగరంలో వర్షాకాలం నేప థ్యంలో పొంచి ఉన్న అంటువ్యాధుల ము ప్పును ఎదుర్కొనేందుకు జీహెఎంసీ పటిష్ట కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసే లక్ష్యంతో శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యా ప్తంగా ఇంటింటా ఫీవర్ సర్వేను ప్రారంభించనుంది. ఈ వర్షాకాలం సీజన్ మొత్తం ఈ సర్వేను నిరంతరాయంగా కొనసాగించనుం ది.

బస్తీలు, మురికివాడలే లక్ష్యంగా..ఈ ఫీవర్ సర్వేలో భాగంగా జీహెఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో, ముఖ్యంగా మురికివా డలు, బస్తీల్లో డోర్-టు-డోర్ సర్వే నిర్వహించనున్నారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి జ్వరం, ఒంటినొప్పులు వం టి అనుమానాస్పద లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. వారికి అక్కడికక్కడే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని తదుపరి చికిత్స నిమిత్తం సమీపంలోని బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేస్తారు.

అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సర్కిల్ స్థాయి వైద్యాధికారులను ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశించారు. అలాగే దోమల నియంత్రణపై కూడా జీహెఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటమా లజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు రెండుసార్లు ఫాగింగ్ నిర్వహించడంతో పాటు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేయనున్నారు. గణాం కాలే హెచ్చరిక.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జీహెఎంసీ ఈసా రి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఈ రెండు నెలల పాటు అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్టు నెల చివరి వరకు నగరంలో 664 డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఒక్క ఆగస్టు నెలలోనే 303 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం (2024) ఆగస్టులో 787 డెం గ్యూ కేసులు, సెప్టెంబర్‌లో 604, అక్టోబర్‌లో 337 కేసులు నమోదయ్యాయి. గతేడా ది మొత్తం 1,883 డెంగ్యూ కేసులు, 88 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సమగ్ర చర్యల ద్వారా సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచేందుకు ఉన్నతాధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.