30-08-2025 01:31:48 AM
నాలుగు నెలల్లో ప్రభుత్వం చెల్లించిన మొత్తం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడి చిన నాలుగు నెలల్లో రాష్ట్ర ఆదాయం రూ. 74,955.74 కోట్లు కాగా, ఆ ఆదాయంలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన వడ్డీనే రూ. 9,355.37 కోట్ల మేర చెల్లించినట్లు ‘కాగ్’ తన జూలైలో వెల్లడించింది. ఏప్రిల్‌లో రూ. 2,260.75 కోట్లు, మే నెలలో రూ.1,956 కోట్లు, జూన్‌లో రూ.2,665 కోట్లు, జూలైలో రూ.2,582.52 కోట్ల మేర వడ్డీ చెల్లించినట్లు స్పష్టం చేసింది.
నాలుగు నెలల్లో రాష్ట్రానికి రూ.74,955.74 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నది. ఈ మొత్తం గతేడాది ఇవే నాలుగు నెలల కాలంలో వచ్చిన ఆదాయం కంటే 0.31 శాతం ఎక్కువని, బడ్జెట్ అంచనాతో పోలిస్తే ఇది 26.32 శాతమని తెలిపిం ది. పన్నుల రూపంలో రూ.48,145 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,334 కోట్లు, కేంద్రం గ్రాంట్లు, కంట్రిబ్యూషన్ల ద్వారా రూ.790 కోట్ల ఆదాయం సమకూరింది. జీఎస్టీ రూ. 16882 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 5067 కోట్లు, సేల్ ట్యాక్స్ ద్వారా రూ.11,368 కోట్లు, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ
ద్వారా రూ.6347 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 5899 కోట్లు రాగా.. జూలై నాటికి సర్కార్ అన్ని పద్దుల కింద రూ.68,823.29 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ పథకాల అమలుకు రూ.24,176 కోట్లు, ఉద్యోగుల జీతాభత్యాలకు రూ.15,961.64 కోట్లు, పింఛన్లకు రూ.6,149 కోట్లు, రాయితీలకు రూ.7191.38 కోట్లు చెల్లించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కార్ రుణాల రూపంలో రూ.54,009 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యంలో జూలై నాటికే 24,669.88 కోట్లు (45.68శాతం) రుణాలు తీసుకోవడం గమనార్హం. సర్కార్ గతేడాది ఇదే కాలానికి రూ.23,563.72 కోట్ల మేర రుణాలు తీసుకున్నది.
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అబద్ధాలు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాం తి): తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్ర భుత్వంపై కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని చేస్తోందంటూ పలు విషయాలను ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా శుక్రవారం వెల్లడించారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఆర్థిక దుష్ర్పచారానికి పాల్పడుతుందని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ర్టం ప్రతి నెలా రూ.7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు.
వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కో ట్లు మాత్రమేనని, అదే 4 నెలల్లో రూ. 9,355 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ర్ట రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ర్పచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.
వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే..
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షా ల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమై న ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయ న విమర్శించారు.
రూ. 3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్ బీ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నా రని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని, ఇది ప్రజా పాలన కాదని ఆయన ట్వీట్ చేశారు.
క్రీడలతో పోరాట స్ఫూర్తి
కేటీఆర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భం గా ధ్యాన్‌చంద్ జయంతిని గుర్తు చేసుకుంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. “ఆటలు మనకు సహకారం, పో రాట స్ఫూర్తిని నేర్పిస్తాయి”అని అన్నారు. “మనం కిందపడితే అది ముఖ్యం కాదు, మళ్లీ ఎలా పైకి లేచామన్నదే ముఖ్యం” అని పేర్కొన్నారు. కష్టాలను అధిగమించి మనకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన క్రీడాకారులను మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.